భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..మల్కాన్‌గిరిలో మావోయిస్టుల ఆయుధాల డంప్ స్వాధీనం.
ఒడిశాలోని మల్కాన్‌గిరిలో మావోయిస్టుల డంప్ నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఐఈడీలు, క్లేమోర్ మైన్లు స్వాధీనం చేసుకున్నారు.
లొంగిపోయిన మావోయిస్టుల సమాచారంతో మథిలి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోదాలు చేపట్టినట్లు ఎస్పీ వినోద్ పాటిల్ తెలిపారు. ఈ ఆయుధాలు AOBSZC మావోయిస్టు క్యాడర్లకు చెందినవిగా అనుమానిస్తున్నారు.
