భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..తూర్పు గోదావరి జిల్లా
దేవరపల్లి పోలీస్ స్టేషన్

యెర్నగూడెం శివారులో 21 కిలోల గంజాయి స్వాధీనం – ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

దేవరపల్లి మండలం యెర్నగూడెం గ్రామ శివారులో, జాతీయ రహదారి (NH-16) సమీపంలోని పాత బ్రాందీ షాపు వద్ద కొంతమంది వ్యక్తులు రెండు మోటారు సైకిళ్లపై వచ్చి, రెండు బ్యాగుల్లో గంజాయిని కలిగి ఉన్నారనే ముందస్తు పక్కా సమాచారంతో దేవరపల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌.ఐ. P.మనోహర్ పోలీసు సిబ్బందితో కలిసి మధ్యవర్తుల సమక్షంలో తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి 21 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా వారు ఉపయోగిస్తున్న రెండు మోటారు సైకిళ్లు మరియు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన గంజాయి విలువ సుమారు 2 లక్షలు ఉంటుంది

పోలీసులకు పట్టుబడిన వ్యక్తులు:

  1. మోచర్ల హేమంత్ కుమార్ @ చిన్ను, తండ్రి: అమ్మన్న, వయస్సు: 20 సంవత్సరాలు, కొర్నిపాడు గ్రామం, పెదపారుపూడి మండలం.
  2. చామనపూడి శరణ్ దాస్ @ చరణ్, తండ్రి: భగవాన్ దాస్, వయస్సు: 28 సంవత్సరాలు, శ్రీనగర్ కట్ట, తాడిగడప, పెనమలూరు మండలం.

ప్రాథమిక దర్యాప్తులో, వీరిద్దరూ గతంలో అనగా 31-08-2026 ఉదయం యెర్నగూడెం సమీపంలో హైవే మొబైల్ విధుల్లో ఉన్న పోలీసు కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసి పారిపోయిన కేసులో కూడా ముద్దాయిగా పోలీసులు గుర్తించారు.

ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తును దేవరపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర నాయక్ నిర్వహిస్తున్నారు.

అరెస్టు చేసిన ముద్దాయిలను గౌరవనీయ న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరుగుతుంది.

దేవరపల్లి సి.ఐ…