భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..గనుల శాఖ అధికారిపై ఏసీబీ కేసు.. భారీగా ఆస్తులు గుర్తింపు

భూపాలపల్లి జిల్లా గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జయరాజుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు

అవినీతి, అనుమానాస్పద మార్గాల్లో ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు

జయరాజు, బంధువులు, సహచరులకు సంబంధించిన 8 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు

ఈ సోదాల్లో ఇప్పటివరకు రూ.3.06 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించిన ఏసీబీ అధికారులు

  • బోడుప్పల్‌లో రూ.40 లక్షల విలువైన G+2 భవనం
  • KPHB కాలనీలో రూ.32.81 లక్షల విలువైన ఫ్లాట్
  • కీసర, తుంగతుర్తి, తూప్రాన్, సూర్యాపేటలో 5 ప్లాట్లు
  • 3.21 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తింపు
  • సోదాల్లో రూ.10.03 లక్షల నగదు స్వాధీనం
  • LIC, Max Life ఖాతాల్లో రూ.19.86 లక్షల పొదుపులు
  • మూడు కార్లు, రెండు బైక్స్.. విలువ రూ.40 లక్షలు
  • పోస్టాఫీస్ ఖాతాలో రూ.20.86 లక్షలు
  • 629 గ్రాముల బంగారు ఆభరణాలు.. విలువ రూ.37.23 లక్షలు
  • గృహోపకరణాల విలువ రూ.10.67 లక్షలు
  • మూడు బ్యాంకు ఖాతాల్లో రూ.71.27 లక్షల నిల్వలు

అధికారి డ్రైవర్ బ్యాంక్ ఖాతా నుంచి కుమార్తె ఖాతాకు రూ.24.80 లక్షల బదిలీలు

ఇసుక రవాణా, సంబంధిత కార్యకలాపాల్లో ఉన్నవారి నుంచి డబ్బులు వసూలు చేసి బదిలీ చేసినట్లు డ్రైవర్ వాంగ్మూలం

రూ.24.80 లక్షల లావాదేవీల మూలం, స్వభావం, ఉద్దేశ్యంపై ఏసీబీ దర్యాప్తు

గుర్తించిన ఆస్తుల మొత్తం విలువ రూ.3,06,53,177

అదనపు ఆస్తులపై ఏసీబీ అధికారులు తదుపరి ధృవీకరణ కొనసాగింపు

స్థిరాస్తుల మార్కెట్ విలువ పత్రాల విలువ కంటే ఎక్కువగా ఉండే అవకాశం

అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)(బి), 13(2) కింద కేసు