భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..బ్రేకింగ్ న్యూస్: వినాయక మండపాల అనుమతులకు పోలీసు శాఖ ఈ-పోర్టల్

A RAJASEKAR.SR Correspondent Vijayawada..సింగిల్ విండో విధానం: వినాయక చవితి మండపాల అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ప్రత్యేకంగా www.ganeshutsav.net పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేదు: వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా అన్ని శాఖల అనుమతులను ఒకే చోట ఆన్‌లైన్ ద్వారానే పొందవచ్చు.

నిర్వాహకులకు వెసులుబాటు: మండప నిర్వాహకుల సౌలభ్యం కోసమే ఈ సింగిల్ విండో ఈ-పోర్టల్‌ను రూపొందించినట్లు వెల్లడి.

డీజీపీ ప్రకటన: ఉత్సవాల ఏర్పాట్లు, అనుమతుల ప్రక్రియపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.