భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ఏపీలో స్థానిక ఎలక్షన్ సమరానికి ముందడుగు.. మూడు దశల్లో మున్సిపల్ వార్డుల డీలిమిటేషన్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా మరో కీలక ప్రక్రియ ముందుకు సాగుతోంది. ఈ ఎన్నికల నేపథ్యంలో వార్డుల పునర్విభజనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల హద్దులను పునర్వ్యవస్థీకరించే ప్రక్రియను పూర్తి చేసేందుకు మున్సిపల్ శాఖ టైమ్‌లైన్ రూపొందించింది. మొత్తం 39 పట్టణ స్థానిక సంస్థల్లో దశలవారీగా డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో 26 పట్టణ స్థానిక సంస్థల్లో డీలిమిటేషన్ ప్రక్రియకు సెప్టెంబర్ 3ను గడువుగా నిర్ణయించారు. పార్వతీపురం, సాలూరు, నర్సీపట్నం, విజయవాడ, రామచంద్రాపురం, జగ్గయ్యపేట, మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి, మార్కాపురం, చీరాల, చిత్తూరు, అనంతపురం, కర్నూలు తదితర పట్టణాలు ఇందులో ఉన్నాయి.