భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..’ఇరుముడి’ మూవీ ఆల్ టైమ్ రికార్డ్?

రవితేజ నటించిన ‘ఇరుముడి’ మూవీ టాలీవుడ్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోందని సినీవర్గాలు చెబుతున్నాయి. విడుదలైన తొలి వారంలో అన్ని ఏరియాల్లో సెకండ్ షోస్ థియేటర్లు ఫుల్ అయిన చిత్రంగా నిలిచిందని పేర్కొన్నాయి. ఇది ఆల్ టైమ్ రికార్డు అని అంటున్నాయి.

ఇరుముడి కొంతమంది హీరోల వరుస ప్లాప్ సినిమాలకు విరుగుడు లాంటిది.

పాత హీరోలను డ్యూయెట్లు లేకుండా తెలుగు ప్రేక్షకులు చూస్తారా అంటే హా మంచి కంటెంట్ తో తీయండి థియోటర్స్ నింపేస్తాం అడ్వాన్స్ బుకింగ్స్ తో చెలరేగి పోతాం అంటున్నారు ప్రేక్షకులు.

రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ లకు స్వస్తి పలికి ఇలా ప్రయోగాలకు సిద్ధపడటంలో సక్సెస్ అయినాడు రవితేజ గారు… అందుకే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ కింగ్ అనిపించుకున్నాడు చాన్నాళ్లూకు రవితేజ.

ఇక సినిమాలోకి వెళ్తే రవితేజ అదే మాస్ అదే ఊపు లో పక్కా పల్లెటూరి ఫ్యామిలీ మెన్ గా అదరగొట్టేశాడు కథ ఆద్యంతం నవ్వులతో పాటు మలుపులు తిరుగుతూ ఆసక్తి రేపుతుంది ఇక మధ్యలో వచ్చే అయ్యప్ప సీక్వెన్సెస్ డప్పు శీను “మల్లె పూల పల్లకి” సాంగ్ థియోటర్ లో అయ్యప్ప భక్తులు కాకపోయినా ఊపు తెప్పిస్తాయి.

మనెమ్మ పాత్రలో పాప జీవించింది ఆ పాప మీద మనకు కోపం వస్తుంది, నవ్వొస్తుంది, ఆఖరికి ఏడిపిస్తుంది. ఇక సాయి కుమార్ గారు పాత్రకు ప్రాణం పోశారు అని చెప్పాలి.

ఇక అయ్యప స్వాముల కాలంలో వచ్చి ఉంటే అయ్యప్ప స్వామిలతో థియోటర్స్ నిండిపోయేవి…చాన్నాళ్లకు రవన్న హిట్ కొట్టాడు.