భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం..ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని , కాంతి రాణా టాటా లపై సస్పెన్షన్ ఎత్తివేత

Ammiraju Udaya Shankar.sharma News Editor…సెప్టెంబర్ 3: సీనియర్ ఐపీఎస్ అధికారులు “విశాల్ గున్ని (2010 బ్యాచ్), కాంతి రాణా టాటా (2004 బ్యాచ్) “లపై ఉన్న సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. వారిని తక్షణమే విధుల్లోకి తీసుకుంటూ గురువారం సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అఖిల భారత సర్వీసుల క్రమశిక్షణ, అప్పీల్ నిబంధనల ప్రకారం విశాల్ గున్ని, కాంతి రాణా టాటాలను ప్రభుత్వం గతంలో సస్పెండ్ చేసింది. అనంతరం వారి సస్పెన్షన్‌ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పొడిగిస్తూ వచ్చింది. తాజాగా వీరిద్దరి సస్పెన్షన్ సెప్టెంబర్ 4 వరకు అమల్లో ఉంది.
ఇద్దరు అధికారుల సస్పెన్షన్ ఎత్తివేతకు సంబంధించి డీజీపీ (హెచ్‌ఓపీఎఫ్) ఇచ్చిన నివేదికలను ప్రభుత్వం పరిశీలించింది. కాంతి రాణా టాటా ఆగస్టు 24న సమర్పించిన వినతిపత్రాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని నిర్ణయించింది.
దీంతో విశాల్ గున్ని, కాంతి రాణా టాటాలను తక్షణమే విధుల్లోకి పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, వారిపై కొనసాగుతున్న క్రమశిక్షణ, క్రిమినల్ కేసులపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇద్దరు అధికారులకు ఉత్తర్వుల ప్రతులను అందజేసి, వారి నుంచి రసీదు తీసుకోవాలని డీజీపీకి ప్రభుత్వం ఆదేశించింది.
ఐ-హబ్
