భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఎయిర్ షోలో కుప్పకూలిన విమానం
Sep 06, 2026,
గ్రీస్ సమీపంలోని తనగ్రా ఎయిర్ బేస్‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్ షోలో భాగంగా యుద్ధ విమానం గాల్లో చక్కర్లు కొడుతూ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. ఎయిర్ బేస్ యానివర్సరీ వేడుకలు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వేలాది మంది ఎయిర్ షోను వీక్షిస్తున్నారు. ప్రేక్షకుల్లో ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు.
