భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..రసాయనాలతో 25.5 టన్నుల కల్తీ నెయ్యి.. స్వాధీనం
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో H-FAST, ఫుడ్ సేఫ్టీ అధికారులు 130 కేంద్రాల్లో సోదాలు నిర్వహించారు.
తనిఖీల్లో 25.5 టన్నుల కల్తీ నెయ్యితో పాటు మొత్తం 36 టన్నుల కల్తీ పదార్థాలను సీజ్ చేశారు.
పామ్ ఆయిల్, వనస్పతి, స్టార్చ్, కృత్రిమ ఫ్లేవర్లతో నకిలీ నెయ్యి తయారు చేసి ‘ప్యూర్ దేశీ నెయ్యి’ పేరుతో విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
తక్కువగా కల్తీ చేసిన నెయ్యిని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, స్వీట్ షాపులు, ఆయుర్వేద దుకాణాలకు సరఫరా చేస్తుండగా..
తీవ్రంగా కల్తీ చేసిన నెయ్యిని పూజల కోసం వాడే నెయ్యిగా మార్కెట్‌లోకి వదిలారు.
ఈ తయారీకి కావాల్సిన పాల మీగడను మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి తెప్పించుకునేవారని పోలీసులు తెలిపారు.
