భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..గుడివాడ పురపాలక సంఘంలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి సమీక్ష సమావేశం
గుడివాడ: గుడివాడ పురపాలక సంఘం కార్యాలయంలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎస్. మనోహర్, మున్సిపల్ అధికారులు, పబ్లిక్ హెల్త్ విభాగం అధికారులు మరియు సంబంధిత కాంట్రాక్టర్లతో చెత్త నిర్వహణ, డంపింగ్ యార్డు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ పట్టాభిరామ్ మాట్లాడుతూ డంపింగ్ యార్డులో ఇప్పటికే ప్రాసెస్ చేసిన చెత్తను వారం రోజుల్లోగా పూర్తిగా తొలగించాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అలాగే మిగిలి ఉన్న చెత్తను సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తిస్థాయిలో ప్రాసెస్ చేయాలని స్పష్టం చేశారు.
అదేవిధంగా రూ.8 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ప్లాంట్ గ్రౌండింగ్ పనులను త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
డంపింగ్ యార్డులోని ప్రాసెస్ చేసిన మరియు మిగిలిన చెత్తను జిందాల్ సంస్థకు తరలించేందుకు అవసరమైన వాహనాలను ఏర్పాటు చేస్తామని చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు. చెత్త నిర్వహణలో ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశించిన గడువులో పనులను పూర్తి చేయాలని సూచించారు.
సమీక్ష సమావేశంలో మున్సిపల్ అధికారులు, పబ్లిక్ హెల్త్ విభాగం అధికారులు మరియు సంబంధిత కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
