భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఎస్పీ గారు విద్యార్థినులతో మాట్లాడుతూ..

▪️తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడాలంటే ముందుగా మనం ఉన్నతంగా ఎదగాలి. అందుకు చదువే ప్రధాన మార్గం” అని సూచించారు. చదువుపై దృష్టి కేంద్రీకరిస్తే ఇతర వ్యాపకాల ప్రభావం మనపై ఉండదని, తల్లిదండ్రులను భవిష్యత్తులో గౌరవంగా చూసుకోవాలంటే ప్రస్తుతం కష్టపడి చదివి మంచి స్థాయికి చేరుకోవాలని తెలిపారు.

▪️ఒకసారి విజయం సాధించామనే సంతృప్తితో ప్రయత్నాన్ని ఆపకూడదు. అత్యున్నత శిఖరాలను చేరుకోవాలంటే నిరంతర సాధన, పట్టుదల ఎంతో అవసరమని విద్యార్థినులకు ప్రేరణనిచ్చారు. జీవితంలో ఎదురయ్యే అపజయాలను చూసి నిరాశ చెందకుండా, వాటి నుంచి పాఠాలు నేర్చుకుని మరింత పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు.

▪️పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా, తాము సాధించాలనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయినా తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని ఎస్పీ గారు హితవు పలికారు. అపజయం జీవితానికి ముగింపు కాదని, విజయానికి దారి చూపించే ఒక అనుభవమని పేర్కొన్నారు. తమ తల్లిదండ్రుల ఆశలను గుర్తు చేసుకుంటూ సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.

▪️సామాజిక మాధ్యమాలు వాడే సమయంలో ప్రైవసీ పాటించాలని తెలియని వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం తెలియజేయడం వలన ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని, మీ గోప్యతే మీ భద్రత అని తెలిపారు.

▪️అనంతరం విద్యార్థినులను బాల్య వివాహాలు, పోక్సో చట్టం తదితర అంశాలపై ప్రశ్నించి, వారికి ఉన్న అవగాహనను తెలుసుకున్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిసినా, బాలికలపై లైంగిక వేధింపులు లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించినా వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.

▪️అలాగే తమ కళ్ల ముందు ఎక్కడైనా గొడవలు, అల్లర్లు, అసాంఘిక కార్యకలాపాలు లేదా అత్యవసర పరిస్థితులు చోటుచేసుకుంటే ఆలస్యం చేయకుండా 112 హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని విద్యార్థినులకు సూచించారు. మహిళలు, బాలికల భద్రత కోసం అందుబాటులో ఉన్న చట్టాలు, రక్షణ వ్యవస్థలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

▪️చివరగా విద్యార్థినుల భవిష్యత్ లక్ష్యాలను అడిగి తెలుసుకున్న జిల్లా ఎస్పీ గారు, వారు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారు, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి ప్రణాళికతో ముందుకు సాగుతున్నారనే విషయాలను తెలుసుకుని వారికి విలువైన సూచనలు అందించారు.

▪️విద్యార్థినులు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదలతో చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు.

▪️అనంతరం గురుకుల విద్యాలయ ఆవరణలో మొక్కలు నాటి, ప్రతి ఒక్కరు మొక్కలను పెంచాలని తద్వారా ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు.

▪️ఈ కార్యక్రమంలో అవనిగడ్డ డిఎస్పి అభిషేక్ గారు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సత్య కిషోర్ గారు, చల్లపల్లి ఇన్స్పెక్టర్ ఈశ్వర్ గారు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు గారు,గురుకుల విద్యాలయ ప్రిన్సిపల్, అధ్యాపకులు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.