భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..జాతీయ జెండాకు ఘోర అవమానం: ఊరి శివారులో తలకిందులుగా ఎగురుతున్న త్రివర్ణ పతాకం.. పట్టించుకోని అధికారులు!

​అధికారుల సమక్షం లేకుండా, ఎలాంటి అవగాహన లేని వారు జెండా ఆవిష్కరణ.
​నిర్జన ప్రదేశంలో తలకిందులుగానే రెండు రోజులుగా ఎగురుతున్న జాతీయ జెండా.

​అల్లూరి సీతారామరాజు జిల్లా, పెదబయలు మండలం, ఇంజారి పంచాయితీ, ఎర్రబయలు గ్రామంలో జాతీయ పతాకానికి తీవ్ర అవమానం జరిగింది.

పంచాయతీ అధికారుల పర్యవేక్షణ లేకుండా, ఎలాంటి అవగాహన లేని వ్యక్తులతో ఊరి శివారులోని నిర్మానుష్య ప్రదేశంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం కలకలం రేపింది.

​కాషాయ రంగు పైభాగంలో ఉండాల్సింది పోయి, ఆకుపచ్చ రంగు పైకి వచ్చేలా తలకిందులుగా జెండాను కట్టేశారు. కనీస అవగాహన లేకుండా జెండాను ఎగరవేసి, గత రెండు రోజులుగా దానిని అలాగే ఉన్న పట్టింపు లేని అధికారులు.

​దేశ సార్వభౌమాధికారానికి ప్రతీక అయిన జాతీయ జెండాను పర్యవేక్షించాల్సిన పంచాయతీ అధికారులు అందుబాటులో లేకపోవడం,బాధాకరం,

​ భారత జాతీయ జెండా నిబంధనావళి (Flag Code of India) మరియు Prevention of Insults to National Honour Act, 1971 ప్రకారం జాతీయ జెండాను తలకిందులుగా ఎగరవేసి ఉంచడం తీవ్రమైన శిక్షార్హమైన నేరం…..