భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..జైళ్లలో 78 మంది ఖైదీలు ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత

తెలంగాణ జైళ్లలో తొలిసారి NIOS ద్వారా 78 మంది ఖైదీలు ఎస్‌ఎస్‌సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. చెర్లపల్లి, నిజామాబాద్, హైదరాబాద్ మహిళా జైలు నుంచి అభ్యర్థులు ఉన్నారు.

చెర్లపల్లి నుంచి 56 మంది, నిజామాబాద్ నుంచి 15 మంది, హైదరాబాద్ మహిళా జైలు నుంచి 7 మంది ఉత్తీర్ణులయ్యారు. ఏడాది పాటు తరగతులు, మాక్ టెస్టులు, ప్రీ-బోర్డు పరీక్షలతో శిక్షణ పొందారు.

డీజీపీ డాక్టర్ సౌమ్య మిశ్రా విజయవంతమైన అభ్యర్థులను అభినందించి, 78 మందికి డీజీపీ ప్రత్యేక రిమిషన్ ప్రకటించారు. 10+2, డిగ్రీతో పాటు ఐటీఐ కోర్సులు కొనసాగించే అవకాశం కల్పించారు.