భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..ఇక అంతా ఆన్లైన్లోనే..
గ్రామాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ మొదలైంది. జీపీలకు సంబంధించిన సమగ్ర సమాచారం డిజిటల్ ప్రొఫైల్లో నమోదు చేస్తున్నారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే అక్కడి అవసరాలు, వనరులు, సమస్యలపై సమగ్ర సమాచారం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేపట్టారు.
ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ శాఖల వద్ద విడివిడిగా ఉన్న సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం డిజిటల్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గ్రామపంచాయతీ ల సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రతీ పంచాయతీ కి ప్రత్యేక డిజిటల్ ప్రొఫైల్ను రూపొందిస్తోంది.
గ్రామానికి సంబంధించిన సమగ్ర సమాచారం తోపాటు ప్రస్తుత అభివృద్ధి పనులు, వాటి పురోగతి, భవిష్యత్ ప్రణాళికలను సైతం ఇందులో పొందుపరుస్తారు….
