భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ధర్మపురి ఉగ్ర నరసింహ ఆలయ పునర్నిర్మాణానికి రూ.10 కోట్లు
▪️ ధర్మపురి క్షేత్రంలోని ఉగ్ర నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. ప్రజల అభిప్రాయాలను తీసుకుని అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు.
▪️ ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయాన్ని పునర్నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
▪️ ధర్మపురి అగ్రహారం బ్రాహ్మణులు, వేద పండితులు, పట్టణ ప్రజల సూచనలతో ముందుకు సాగుతామని చెప్పారు. గోదావరి పుష్కరాల కోసం ధర్మపురి నియోజకవర్గానికి ఇప్పటికే రూ.117 కోట్లు కేటాయించామని, బైపాస్ రోడ్లు, పుష్కర ఘాట్ల కోసం మరో రూ.40 కోట్లు విడుదల కానున్నాయని తెలిపారు.
