భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..శ్రీ మేధా దక్షిణామూర్తి సహస్రనామ స్తోత్రము ॥
దక్షిణే చాక్షమాలాం చ
వహ్నిం వై వామహస్తకే।
జటామండల సంలగ్న
శీతాంశు కరమండితమ్॥
అర్థం:
దక్షిణే చాక్షమాలాం చ
కుడి చేతిలో జపమాల, అక్షమాల ధరించినవాడు. ఇది యోగాన్ని, ధ్యానాన్ని సూచిస్తుంది
వహ్నిం వై వామహస్తకే
ఎడమ చేతిలో అగ్ని, జ్ఞాన జ్వాలను ధరించినవాడు. అజ్ఞానాన్ని కాల్చే జ్ఞానాగ్ని
జటామండల సంలగ్న
జటల ముడిలో…
శీతాంశు కరమండితమ్
చంద్రకళతో అలంకరించ బడినవాడు. చల్లని కాంతితో ప్రశాంతతను ఇచ్చేవాడు
ఈ రూపంలోని రహస్యం:
దక్షిణామూర్తి అంటే దక్షిణం వైపు చూసే గురువు. గురువు ఎప్పుడూ దక్షిణం వైపు కూర్చుంటాడు. ఆయన మౌనంగా కూర్చుని బోధిస్తాడు. మాటలు లేకుండానే శిష్యుల సందేహాలు తీరుస్తాడు.
మానవుడు భగవంతుని ఏం కోరాలి? అనే దానికి ఈయనే సమాధానం.
మేధా దక్షిణామూర్తిని ఏం కోరాలి అంటే – జ్ఞానం కోరాలి.
డబ్బు అడిగితే ఖర్చు అయిపోతుంది, జ్ఞానం అడిగితే అది పెరుగుతూనే ఉంటుంది, ఎవరూ దోచుకోలేరు.
గురువారం నాడు శనగల దండతో, నెయ్యి దీపంతో “ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః” అని జపిస్తే మేధస్సు, ఏకాగ్రత, విద్యలో విజయం కలుగుతుంది.
మిత్రులకు,బృహస్పతి వాసర శుభోదయం.
