ఆర్టీసీ ఉద్యోగులకు ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొన్నం

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..ఆర్టీసీ ఉద్యోగులకు ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొన్నం

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

యూనియన్ ఎన్నికల తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

రూ. 6 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న సిబ్బంది కూడా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

మరణించిన డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆయన కుమారుడికి ఆర్టీసీలో ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు.