ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ రుణాలపై వడ్డీ మాఫీ ని సద్వినియోగం చేసుకోండి: చైర్మన్ సావిత్రి

ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ రుణాలపై వడ్డీ మాఫీ ని సద్వినియోగం చేసుకోండి: చైర్మన్ సావిత్రి

భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..పాకాల ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం పాలక వర్గము ఆఫీస్ నందు మంగళవారం సమావేశమైనది. ఈ సమావేశములో మండల సింగల్ విండో చైర్మన్ క్రిష్ణమనేని సావిత్రి మాట్లాడుతూ సంఘము నందు 31-03-2015 వ తేదికి మునుపు పంట ఋణము తీసుకొని ఇంకను చెల్లించని రైతులకు మరియు పంట ఋణము తీసుకొని చనిపోయిన రైతులకు వడ్డీలో 6% డీసీసీ బ్యాంకు మాఫీ చేస్తుంది అని తెలిపారు.అదే విధముగా దీర్ఘకాలిక ఋణములు తీసుకొని ఇంకను ఋణము చెల్లించని వారికీ వడ్డీ ఫై వడ్డీ మరియు అపరాధ వడ్డీలు మాఫీ చేయడం జరుగుతుంది అని తెలిపారు కావున మరణించిన రైతు యొక్క మరణ ధ్రువీకరణ పత్రము, ఆధార్ కార్డు వారి యొక్క వారసుల ఆధార్ కార్డు తీసుకొని సంఘము కార్యాలయమునకు వచ్చిన యడల సంఘం సీఈఓ లోన్ వివరాలు తెలిపి మాఫీ అభ్యర్ధన పత్రము ఫై సంతకము చేసి ఇచ్చిన పిదప డీసీసీ బ్యాంకు చిత్తూరు నందు సమర్పించిన యెడల వారికీ వడ్డీ మాఫీ పథకము వర్తిస్తుంది అని తెలిపారు.కావున ఈ అవకాశాన్ని రైతులు అందరూ సద్వినియోగం చేసుకొని బకాయి రుణాలు చెల్లించి మరల కొత్త పంట రుణాలు మరియు ST ఇతర రుణాలు 5 లక్షల వరకు పొందవచ్చు అని తెలిపారు.ఈ సమావేశము నందు సంఘ డైరెక్టర్లు ఆనంద్,కిరణ్ కుమార్ సంఘ సీఈఓ మురళి కృష్ణ మరియు డీసీసీ బ్యాంకు మేనేజర్ చక్రవర్తి,సూపర్వైజర్ దొరస్వామి పాల్గొన్నారు.