భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..చైనాలో భారీ ప్రమాదం!
మట్టిలో కలిసిపోయిన ఇళ్లు!!
చోంగ్కింగ్, పెంగ్షుయి కౌంటీలో ఘోరం జరిగింది. దశాబ్దాలుగా చూడని పెను విపత్తు సంభవించింది.
ఉన్నపళంగా ఇళ్లపై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.
చూస్తుండగానే ఒకేసారి పదుల సంఖ్యలో ఇళ్లు మట్టిలో కూరుకుపోయాయి.
1,100 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ప్రస్తుతం రెస్క్యూ బృందాలు సమయంతో పరుగు పెడుతున్నాయి.
శిథిలాల మధ్య ప్రాణాల కోసం వెతుకుతున్నాయి.
చైనా ప్రభుత్వ మీడియా ప్రకారం ఇప్పటివరకు 10 మందిని రక్షించారు.
కానీ, ఇంకా చాలా మంది శిథిలాల మధ్య చిక్కుకున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.

సెకన్లలో కొండ మొత్తం ఊరిపై పడ్డ వీడియోలు చూస్తుంటే ఒళ్లు జలదరిస్తోంది…
