రేషన్ కార్డుదారులకు eKYC తప్పనిసరి.. ఇంకా పది రోజులే గడువు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..రేషన్ కార్డుదారులకు eKYC తప్పనిసరి.. ఇంకా పది రోజులే గడువు

తెలంగాణ పౌర సరఫరాల శాఖ రేషన్ కార్డుదారులకు కీలక సూచన చేసింది.

రేషన్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం ఇ-కేవైసీ ప్రక్రియను చేపట్టింది.

జులై 31 లోపు ఇ-కేవైసీ పూర్తి చేయాలని సూచించింది.

ఈ గడువులోగా పూర్తి చేయని కుటుంబాలకు భవిష్యత్తులో రాయితీ రేషన్‌తో పాటు ఆహార భద్రతా కార్డు (FSC) ద్వారా అందే ప్రభుత్వ ప్రయోజనాలు నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

రేషన్ కార్డులో నమోదైన ప్రతి కుటుంబ సభ్యుడు బయోమెట్రిక్ లేదా ఐరిస్ స్కాన్ ద్వారా ధృవీకరణ పూర్తి చేయాలి.