అమెరికా న్యూజెర్సీలో రోడ్డు ప్రమాదం – వినుకొండ మండల విద్యార్థిని మృతి

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.అమెరికా న్యూజెర్సీలో రోడ్డు ప్రమాదం – వినుకొండ మండల విద్యార్థిని మృతి

వినుకొండ: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన యువతి మక్కెన ప్రసన్న(27) న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో
మృతి చెంది.

సాధారణ రైతు కుటుంబానికి చెందిన మక్కెన వెంకటేశ్వర్లు, గోవిందమ్మ దంపతులకు ముగ్గురు సంతానం.వారిలో పెద్ద కుమార్తె ప్రసన్న 2022లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లింది. అక్కడ ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది.

మంగళవారం ప్రసన్న తన ముగ్గురు స్నేహితులతో కలిసి అద్దె కారులో ఒక కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది.
ఈ ఘటనలో ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందగా,ఆమె స్నేహితులకు గాయాలయ్యాయి.

పెద్ద కుమార్తె మరణ వార్త విన్న వెంకటేశ్వర్లు కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.ఈ వార్తతో ఉమ్మడివరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ విషయం తెలుసుకున్న ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్,వినుకొండ ఎమ్మెల్యే జీవి.ఆంజనేయులు
మృతురాలి తండ్రికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

కుటుంబ సభ్యులు కూడా తమ కుమార్తె మృతదేహాన్ని
త్వరగా భారత్ కు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.