పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్లు.. రేపటి నుంచే ప్రారంభం

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్లు.. రేపటి నుంచే ప్రారంభం

తెలంగాణ :

గ్రామీణ ప్రాంతాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు పట్టణ పేదలపై దృష్టి సారించింది.

పట్టణాల్లోని తక్కువ ఆదాయ వర్గాల (LIG) కోసం ‘ఇందిరమ్మ ఇళ్లు – ఎల్‌ఐజీ హౌసింగ్ టవర్స్’ పథకాన్ని జులై 20వ తేదీన ప్రారంభించనుంది.

హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (హైదరాబాద్ క్యూర్) పరిధిలో మొదలయ్యే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆధునిక అపార్ట్‌మెంట్ తరహా గృహాలను సర్కారు నిర్మించనుంది.

ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తు విధానం, అర్హతల వివరాలను ప్రభుత్వం రేపు అధికారికంగా ప్రకటించనుంది.