భారత్ న్యూస్ విజయవాడ…ఉమ్మడి జిల్లాలో అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి రూ. 4,32,000/- ఆర్థిక సాయం
జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా చెక్కు అందజేత
వితరణగా ఒక్క రోజు వేతనాన్ని అందజేసిన ఉమ్మడి జిల్లా హోంగార్డులకు అభినందనలు తెలియజేసిన జిల్లా ఎస్పీ
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు ఎన్ ఆంజనేయులు ( హెచ్ జి నంబర్ 182) కుటుంబానికి రూ. 4,32,000/- ఆర్థిక సాయం అందించారు. జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎస్పీ ఛేంబర్లో మృతుడి భార్య జయలక్ష్మికి బుధవారం అందజేశారు. ఈ డబ్బును వృథా చేసుకోకుండా పిల్లల/కుటుంబ అభివృద్ధికి వినియోగించుకోవాలని ఎస్పీ గారు సూచించారు. ఉమ్మడి జిల్లా హోంగార్డులు తమ గౌరవ వేతనంలో ఒక రోజు వేతనాన్ని ఇలా మృతిచెందిన సహచర హోంగార్డు కుటుంబాలకు అందజేయడం అభినందనీయమని ఎస్పీ గారు పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ డి.వి.రమణమూర్తి, ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఇలియాజ్ బాషా, రిజర్వ్ ఇన్స్పెక్టర్ మధు, తదితరులు పాల్గొన్నారు.
