భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.బ్యాంకుల్లో క్లెయిమ్ చేసుకోని డిపాజిట్ల విలువ రూ.1 లక్ష కోట్లు.

ఆర్బీఐ ఉడ్గాం పోర్టల్ ద్వారా పొందొచ్చు

దేశంలోని వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, మర్చిపోయిన, క్లెయిమ్ చేసుకోని సొమ్ము విలువ దాదాపు రూ.1 లక్ష కోట్లు ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం జనవరి 31, 2026 నాటికి దేశంలోని బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని సొమ్ము రూ.98,073. దీనికి సంబంధించిన వివరాల్ని గతంలోనే వెల్లడించింది. ఈ సొమ్మును గురించి తెలుసుకునేందుకు అవకాశాలు కూడా కల్పించింది. ఇందుకోసం ఆర్బీఐ ఉద్గామ్ (UDGAM) అనే పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేసింది.

ఈ పోర్టల్ ద్వారా ఎవరైనా తమకు సంబంధించిన లేదా మర్చిపోయిన లేదా మరణించిన తమ వారి బ్యాంకు డిపాజిట్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.

ఈ నిధిలో మిగిలిపోయిన డిపాజిట్లను సంబంధిత వ్యక్తులు క్లెయిమ్ చేసుకోవచ్చు. సంబంధిత బ్యాంకుల్ని సంప్రదించి, తమ డబ్బు అందడానికి కావాల్సిన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది