రైల్వే డి.ఆర్.యు.సి.సి మెంబర్ గా డాక్టర్ సాకం కృష్ణమూర్తి

పాకాల (భారత్ న్యూస్) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వరదప్పనాయుడుపేట నివాసి డాక్టర్ సాకం కృష్ణమూర్తిని రైల్వే డి.ఆర్.యు.సి.సి మెంబర్ గా బుధవారం ఎన్నుకున్నారు.రియల్స్ స్వచ్ఛంద సంస్థ,ప్రధాన కార్యదర్శి డాక్టర్ లయన్ సాకం కృష్ణమూర్తిని సౌత్ సెంట్రల్ రైల్వే గుంతకల్ డివిజన్ కు డి.ఆర్.యు.సి.సి మెంబర్ గా నియమించడం జరిగింది.రెండు సంవత్సరములు పదవీ కాలానికి ఈ నియామకం జరిగింది.ఈ సందర్భంగా డా.సాకం కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ పదవిలో నియమించినందుకు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్,సౌత్ సెంట్రల్ రైల్వే గుంతకల్ ఎన్.మనోజ్ కి కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని,నా బాధ్యతలను శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానని తెలిపారు.ఈ సందర్భంగా పలువురు అధికారులు,అనధికారులు,స్నేహితులు,బంధువులు అభినందనలు తెలియచేసారు.