భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.జిల్లా పోలీస్ కార్యాలయంలో “మీ కోసం” కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.,

క్రైమ్ న్యూస్ కృష్ణా :

జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “మీ కోసం” కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను సావధానంగా విన్నారు.

ఈ సందర్భంగా వివిధ సమస్యలతో వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎస్పీ గారి దృష్టికి తీసుకురాగా ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన బాధితుల సమస్యలకు చట్టపరమైన పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.

ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించే ప్రతి ఒక్కరి సమస్యను నిష్పక్షపాతంగా పరిశీలించి, చట్ట ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎస్పీ గారు తెలిపారు.

ప్రజల సమస్యల పరిష్కారమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, “మీ కోసం” కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈరోజు మీకోసం కార్యక్రమానికి మొత్తం 55 ఫిర్యాదులు రాగా అందులో…

▪️కూచిపూడి నుండి వివేక్ అనే వ్యక్తి తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తిని తనకు రానివ్వకుండా తన తమ్ముడు ఇబ్బంది పెడుతున్నాడని న్యాయం చేయమని ఫిర్యాదు.

▪️గుడివాడ నుండి జ్యోతి అనే వివాహిత వచ్చి తనకు వివాహం జరిగి ఐదు సంవత్సరాలు అవుతుందని తన భర్త అదనపు కట్నం కోసం తీవ్ర వేధింపులకు గురి చేయడమే కాకుండా కట్నం తీసుకురాని పక్షంలో విడాకులు ఇస్తానని బెదిరిస్తున్నాడని న్యాయం చేయమని ఫిర్యాదు.

▪️తోట్లవల్లూరు నుండి ప్రసన్న అనే మహిళ వచ్చి తన భర్త ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించాడని అయితే తన అత్తింటివారు ఆడపడుచు ఆ ఇంటిలో ఉండనివ్వకుండా బలవంతంగా బయటికి పంపించాలని చూస్తున్నారని, పెద్ద మనుషుల్లో పెట్టినప్పటికీ ప్రయోజనం లేదని న్యాయం చేయమని ఫిర్యాదు.

▪️చల్లపల్లి నుండి రాములు అని వృద్ధుడు వచ్చి తనకు 82 సంవత్సరాలని తనకున్న ఇద్దరు కుమారులు వృద్ధ దంపతులమైన మమ్ములను చూడకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని న్యాయం చేయమని ఫిర్యాదు.