భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు..పోర్చుగల్‌లోని లిస్బన్ చేరుకున్న ఐఎన్‌ఎస్ సుదర్శిని

ఇండియన్‌ నేవీకి చెందిన శిక్షణ నౌక ఐఎన్‌ఎస్‌ సుదర్శిని ఆగస్టు 22న పోర్చుగల్‌లోని లిస్బన్‌ చేరుకుంది.

ఏడు నెలల్లో 15వ పోర్ట్‌ కాల్‌ పూర్తి చేసిన సుదర్శిని భారత్‌-పోర్చుగల్‌ మధ్య స్నేహం, సముద్ర సహకారం, సౌభ్రాతృత్వ సందేశాన్ని చాటుతోంది.

ప్రపంచవ్యాప్తంగా స్నేహ సంబంధాలను బలోపేతం చేస్తూ ‘వసుధైవ కుటుంబకం’ సందేశాన్ని ముందుకు తీసుకెళ్తోంది.