భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.కొత్త ఫించన్ దరఖాస్తుకు కావలసిన పత్రాలు:

📍ఆధార్, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం.

📍వృద్ధాప్య పింఛన్లకు వయో నిర్ధారణ సర్టిఫికెట్. లేదా ఆధార్.

📍వితంతు పింఛన్లకు భర్త డెత్ సర్టిఫికెట్. భర్త ఆధార్.

📍వివాహిత ఒంటరి మహిళలు విడాకుల సర్టిఫికెట్.

📍అవివాహిత ఒంటరి మహిళలు తహసీల్దార్ సర్టిఫికెట్.

📍దివ్యాంగులకు(40% వైకల్యం) సదరం సర్టిఫికెట్.

📍చేనేత కార్మికులు జౌళిశాఖ ఇచ్చే సర్టిఫికెట్.

📍మత్స్యకారులు మత్స్యశాఖ ఇచ్చే సర్టిఫికెట్.

📍డప్పుకళాకారులు, చర్మకారులు సాంఘిక సంక్షేమ శాఖ ఇచ్చిన ధ్రువపత్రం.

📍కల్లుగీత కార్మికులకు ఎక్సైజ్ శాఖ సర్టిఫికెట్.

📍ట్రాన్సో జెండర్లు జిల్లా వైద్య బోర్డు ఇచ్చే ధ్రువపత్రం

ఇదీ.. షెడ్యూల్!

📍దరఖాస్తుల స్వీకరణ: సెప్టెంబరు 7 నుంచి 16 వరకు.

📍ఎవరికి ఇవ్వాలి: గ్రామ/వార్డు సచివాలయంలోని డిజి టల్ అసిస్టెంట్

📍ఈ-కేవైసీ: ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఈ-కేవైసీ తనిఖీ బాధ్యత డిజిటల్ అసిస్టెంట్లే.

📍అర్హత పరిశీలన: స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు, ఆర్టీజీఎస్, సెర్చ్ విభాగాలు చేస్తాయి.

📍క్షేత్రస్థాయి పరిశీలన: ఈ నెల 17 నుంచి 21లోగా పూర్తి.

📍అర్హత నిర్ణయం: ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్/జి ల్లా/రాష్ట్రస్థాయి అధికారులు.

📍అర్హత నిర్ణయానికి పట్టే సమయం: ఈ నెల 22-24వ తేదీ వరకు.

📍తుది ఆమోదం: ఈ నెల 25 నుంచి 26వ తేదీలోగా సెర్చ్ తుది ఆమోదం.