భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్కు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్….
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు ప్రధాని మోదీ గట్టి హెచ్చరికలు చేశారు. ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే భారత సైన్యం వారి భూభాగంలోకి చొరబడి దాడి చేస్తుందని స్పష్టం చేశారు.
దేశంలో ఉగ్రవాదం, నక్సలిజంపై ఉక్కుపాదం మోపుతున్నామని, జమ్మూ కాశ్మీర్ నుంచి ఈశాన్య ప్రాంతాల వరకు శాంతి నెలకొంటుందని తెలిపారు. గతంలో భారత పాలసీలపై చర్చించిన ప్రపంచం.. ఇప్పుడు దేశ డైనమిజం గురించి మాట్లాడుకుంటోందని ప్రధాని పేర్కొన్నారు..
