భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ముందడుగు
అమరావతి: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ముందడుగు పడింది. ఇటీవల సవరించిన మున్సిపల్ చట్టాలకు అనుగు ణంగా నగరపాలక సంస్థల్లో మేయర్, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో చైర్‌పర్సనను ప్రత్యక్ష పద్ధతిలో, డిప్యూటీ మేయర్, వైస్ చైర్పర్స నన్ను పరోక్ష పద్ధతిలో ఎన్నుకునే విధానాలు ఖరారు చేసింది. కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఎన్నికకు అనుసరించాల్సిన నిబంధనలు ప్రకటించింది. ఓటర్ల జాబితాల ప్రచురణ, వార్డుల విభజన పూర్తయి 59 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు కోసం షెడ్యూల్ విడుదల చేసింది. రిజర్వేషన్ల ఖరారుకు ఈ ప్రక్రియను చేప డుతోంది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ శనివారం 6 వేర్వేరు ఉత్తర్వులు ఇచ్చింది. మరో 41 పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల విభజన ఆధారంగా ఓటర్ల జాబితాల రూపకల్పనను ప్రభుత్వం వేగవంతం చేసింది. వారం రోజుల్లో వాటిని ప్రచురిస్తామని ఓ ప్రకటనలో వెల్లడిం చింది. కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్న మరో 23 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి న్యాయస్థా నాల నుంచి ఉత్తర్వులు విడుదలైన వెంటనే తదు పరి చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
◆ పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు 2026
జనవరి 1ని అర్హత తేదీగా నిర్ణయిస్తూ సెప్టెంబరు 3 నాటికి వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలు ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిపై చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓటర్ల గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కావటంతో పురపాలక శాఖ కమిషనర్(సీడీఎంఏ) నుంచి అందిన ప్రతిపా దనల మేరకు 59 పట్టణ స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు కోసం 14 రోజుల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.
షెడ్యూల్ ఇదీ..
సెప్టెంబరు 8–12: ఇంటింటికీ వెళ్లి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు
సెప్టెంబరు 13: ఎస్సీ, ఎస్టీ బీసీ, మహిళా ఓటర్లను మార్క్ చేసిన జాబితా తయారీ
” సెప్టెంబరు 14: ముసాయిదా జాబితా ప్రచురణ
సెప్టెంబరు 15-17: అభ్యంతరాలు, క్లెయి మ్ల స్వీకరణ
సెప్టెంబరు 18: అభ్యంతరాలు, క్లెయిమ్‌ల వర్గీకరణ, వాటి పరిశీలనకు అధికారుల నియా మకం, శిక్షణ
సెప్టెంబరు 19-20: అభ్యంతరాలు, ఫిర్యా దులపై క్షేత్రస్థాయి పరిశీలన, పరిష్కారం
” సెప్టెంబరు 21: కేటగిరీల వారీగా తుది
ఓటర్ల జాబితాల ప్రచురణ. పురపాలక శాఖ కమి షనరు(సీడీఎంఏ) సమర్పణ
ఆ 59 పట్టణ స్థానిక సంస్థలు ఇవే..
విజయనగరం నగరపాలక సంస్థ
విశాఖపట్నం రీజియన్ (6): పలాస-కాశీబుగ్గ, బొబ్బిలి, యలమంచిలి, పాలకొండ, నెల్లి మర్ల, ఇచ్చాపురం
రాజమహేంద్రవరం రీజియన్ (18): తుని, అమలాపురం, నిడదవోలు, మండపేట, నరసాపురం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, సామర్ల కోట, పెద్దాపురం, నందిగామ, నూజివీడు, ఉయ్యూరు, ముమ్మడివరం, ఏలేశ్వరం, తిరువూరు, గొల్లప్రోలు, కొండపల్లి, ఆకివీడు
గుంటూరు రీజియన్ (15): తెనాలి, రేపల్లె,అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు, వెంకటగిరి, ఆత్మకూరు (నెల్లూరు జిల్లా), సూళ్లూరుపేట, నాయుడుపేట, దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, పిడుగు రాళ్ల, గురజాల, దాచేపల్లి
అనంతపురం రీజియన్ (19): హిందూపురం, గూడూరు(కర్నూలు), గుంతకల్లు, ఆదోని, ఎమ్మిగనూరు, పుంగనూరు, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు (నంద్యాల), ఆళ్లగడ్డ, గుత్తి, కళ్యాణ దుర్గం, మైదుకూరు, రాజంపేట, కుప్పం, బేతంచెర్ల, పెనుగొండ, మదనపల్లె, మడకశిర
