భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి నిశ్చితార్థం ఖరారు: అమెరికా డాక్టర్తో పెళ్లి!
వైఎస్ షర్మిల తన కుమార్తె వై.ఎస్. అంజలి రెడ్డి వివాహం నిశ్చయమైనట్లు సామాజిక మాధ్యమం ‘X’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.
వరుడు: డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డి (వృత్తిరిత్యా వైద్యుడు)
వరుడి తల్లిదండ్రులు: శ్రీ సోమల సుబ్బా రెడ్డి, శ్రీమతి సోమల పద్మా రెడ్డి
వరుడి కుటుంబానిది ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కాగా, ప్రస్తుతం వీరంతా అమెరికా పౌరులుగా స్థిరపడ్డారు.
ఈ ఆనందకరమైన విషయాన్ని పంచుకుంటూ షర్మిల దంపతులు, “మా కుమార్తె వివాహం నిశ్చయమైనందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మిత్రులు, శ్రేయోభిలాషులందరి ప్రార్థనలు మరియు ఆశీస్సులు మా కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాం” అని పేర్కొన్నారు.
చివర్లో హల్లెలూయ అని ముగించిన ఈ ప్రకటనతో పాటు వరుడు రఘురామ్ రెడ్డి, వధువు అంజలి రెడ్డిల ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.
