భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.షాకింగ్.. 11 ఏళ్లుగా వెంట్రుకలు తింటున్న యువతి

దాన్ని బయటకు తీయగా.. అమ్మాయి ఇప్పుడు కోలుకుంటోందని చెప్పిన వైద్యులు…

ఢిల్లీలో వెలుగు చూసిన విచిత్రమైన ఘటన

తనకు తొమ్మిదేళ్ల వయసు నుంచే ఓ యువతికి(20)కి వెంట్రుకలు తినే అలవాటు ఉంది. 11 ఏళ్లుగా వెంట్రుకలు తింటోంది.. ఈ ప్రవర్తనను ‘ట్రైకోఫేజియా’ అని అంటారు. అయితే.. ఇటీవల ఆమెకు వాంతులు, తీవ్రమైన కొడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. ఆమె పొట్టలో ఒక ముద్దలాంటిది గుర్తించారు

ఎండోస్కోపీ నిర్వహించగా.. అది వెంట్రుకలతో తయారైన ముద్ద అని తేలింది. సర్జరీ చేసి దాన్ని బయటకు తీయగా.. 1.16 కిలోల బరువు ఉన్నట్లు గుర్తించారు. అన్నవాహిక, పొట్ట కలిసే ప్రాంతం నుంచి చిన్నపేగు వరకు ఆ ముద్ద విస్తరించింది.