భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న

Ammiraju Udaya Shankar.sharma News Editor…పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రారంభించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ ప్రారంభంతో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల 30 ఏళ్ల కల సాకారమైందని కొనియాడారు. నల్లమల కొండల్లోని రెండు సొరంగాల నుంచి గంటవానిపల్లె ఆక్విడెక్టు ద్వారా నల్లమల సాగర్‌కు పరుగులెత్తుతున్న కృష్ణా జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలసి పాల్గొన్నడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.తొలిదశ ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందనుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎంపీ మాగుంటతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద ఎత్తున ప్రజలు మరియు రైతులు పాల్గొన్నారు.
