అప్పుల బాధతో మరణించిన కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఆదిత్య చౌదరి

ఏలూరు జిల్లా ముదినేపల్లి:::: భారత్ డిజిటల్ వరల్డ్ వెబ్ న్యూస్ ప్రతినిధి:::: అప్పుల బాధతో మరణించిన కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఆదిత్య చౌదరి వణుదుర్రు గ్రామానికి చెందిన భూపతి శ్యాం కుమార్ అతని భార్య వెన్నెల అప్పుల బాధతో గత మూడు రోజుల కిందట మరణించిన విషయం విదితమే, భూపతి శ్యాం కుమార్, వెన్నెల దంపతులు అప్పుల భాద తట్టుకోలేక మరణించారని గ్రామస్తులు చెప్పారు మృత దంపతులకు 6 సంవత్సరాల గలిగిన జ్ఞానేశ్వర్ రావు అనే కుమారుడు ఉన్నాడని మరణించిన భూపతి శ్యాం కుమార్ తల్లి వికలాంగురాలని, శ్యాం కుమార్ వెన్నెలలు , రోజువారి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారని, అప్పుల బాధ తాళలేక మరణించారని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న చల్లగుళ్ళ ఆదిత్య చౌదరిని సహాయం కోరగా వణుదుర్రు గ్రామంలో మరణించిన భూపతి శ్యాం కుమార్ దంపతుల బంధువులకు దశదిన కార్యక్రమాల నిమిత్తము 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మానవత్వంతో అందించారు. మృతుని కుటుంబానికి తమవంతుగా ఆర్థిక సహాయం అందించే దాతలు ముందుకు రావాలని,చిన్నారి జ్ఞానేశ్వర్రావ్ భవిష్యత్తు కొరకు తమ వంతు సహాయం సహకారాల అందించాలని పిలుపునిచ్చారు