భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..కర్రెగుట్టల్లో మందుపాతర పేలి గిరిజనుడి మృతి…..

తెలంగాణ : ములుగు జిల్లా కర్రెగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి దుల్లచెరువు కాలనీకి చెందిన మడకం నాగేశ్వరరావు అనే గిరిజనుడు మృతి చెందాడు.

వెదురు బొంగుల కోసం గుట్టలపైకి వెళ్లినప్పుడు ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు….