భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..సూర్యాపేట మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య అరెస్టు….

తెలంగాణ : ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై సూర్యాపేట టౌన్ ప్లానింగ్ అధికారి సోమయ్య నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి, అతన్ని అరెస్ట్ చేశారు.

సూర్యాపేట మానసానగర్, హైదరాబాద్ హయత్‌నగర్‌లోని సోమయ్య నివాసాలతో పాటు సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలోని రికార్డులను కూడా అధికారులు తనిఖీ చేశారు.

ఉదయం నుంచి సోమయ్య నివాసంతో పాటు బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ప్రస్తుతం సోమయ్యను సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు…