భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఉపాధి నిధుల్లో మూడో వంతు పంచాయతీలే ఖర్చు చేయాలి:కేంద్రం

వీబీ జీ రామ్ జీ స్కీమ్(ఉపాధి హామీ)కింద మంజూరు చేసే నిధుల్లో కనీసం మూడో వంతును పంచాయతీ స్థాయిలోనే ఖర్చు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

దీంతో ఫీల్డ్ అసిస్టెంట్లు,ఇతర సిబ్బంది గౌరవ వేతనాల చెల్లింపులకు నిధుల కొరత ఉండదని పేర్కొందిఅలాగే పథకం మొత్తం వ్యయంలో పరిపాలనా ఖర్చులను 9 శాతానికి పరిమితం చేసింది.

శిక్షణ,అవగాహన కార్యక్రమాలు,తనిఖీలు తదితరాల కోసం ఈ పరిమితికి మించి ఖర్చు చేస్తే ఆ అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది….