భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..గ్యాస్ ఈకేవైసీ చేశారా? రేపటితో ముగియనున్న నమోదు

చేయకపోతే గ్యాస్ రాయితీ రద్దయ్యే అవకాశం.

మీరు ఇంకా గ్యాస్కు సంబం ధించి ఈకేవైసి చేయించుకోలేదా, అయితే మీరు గ్యాస్ రాయితీని త్వర లోనే కోల్పోయే అవకాశం ఉంది.

ఈకేవైసీ చేయించుకోవడానికి ఇంకా మిగిలింది 48 గంటలే.

ఆన్ లైన్ ద్వారా హెచ్పీ, ఇండేన్, భారత్ గ్యాస్ కంపెనీల (మీరు వాడే కంపెనీ గ్యాస్) యాప్లను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.

కనెక్షన్ కు లింక్ అయిన సెల్ఫోన్ నంబరుతో లాగిన్ కావాలి.

మై ప్రొఫైల్లోకి వెళ్లి ఈకేవైసీ ఆప్షన్పై క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది.

అది నమోదు చేసి గుర్తింపును ధ్రువీకరించి సబ్మిట్ చేయాలి.

తర్వాత 24 నుంచి 48 గంటలలోపు ఈకేవైసీ అప్ డేట్ అవుతుంది.

ఈ ప్రక్రియకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరంలేదు.

గ్యాస్ ఏజన్సీ కేంద్రాలకూ వెళ్లి ప్రక్రియ పూర్తిచేసుకోవచ్చు.