..భారత్ న్యూస్ హైదరాబాద్….కుక్కల దాడిలో 24 గొర్రె పిల్లలు మృతి…
నిర్మల్ జిల్లా :
భైంసా మండలం ఈలేగాం గ్రామంలో కుక్కల దాడిలో 24 గొర్రె పిల్లలు మృతి…
ఈలేగాం గ్రామానికి చెందిన చౌలా గజ్జరామ్, చౌలా సాయిలు అనే గొర్రెల కాపరులకు చెందిన గొర్రె పిల్లలు ఇంటి వద్ద పాకలో ఉండగా పాకలో చొరబడిన వీధి కుక్కలు దాడి చేయగా 24 గొర్రె పిల్లలు చనిపోయాయి..
వీటి విలువ దాదాపు లక్ష రూపాయలు ఉంటాయని బాధితులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయం అందించాలని బాధితులు కోరారు..
