భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్.. ఆగస్టు 18 నుంచి అమలు….

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, హెచ్-సిటీ ప్రాజెక్ట్ నిర్మాణాల నేపథ్యంలో, ఆగస్టు 18వ తేదీ నుంచి వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని అధికారులు అమలు చేయనున్నారు. ఈ విధానం సుమారు ఏడాదిన్నర పాటు అమల్లో ఉంటుంది. ఇప్పటికే రెండు దశల్లో ట్రయల్స్ నిర్వహించి, అవసరమైన మార్పులు చేశారు. 24 గంటల పర్యవేక్షణ, దిశా సూచిక బోర్డులు, నావిగేషన్ యాప్‌లలో అప్‌డేట్‌లు ఉంటాయి. రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు ఉంటాయని, అత్యవసర వాహనాలకు ప్రత్యేక లేన్ కేటాయింపు ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు…