భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.‎కొద్ది నెలల్లోనే పరిష్కారం.. కొల్లేరు రైతులకు ఎంపీ భరోసా

‎.. ఏలూరులో ఎంపీ ని కలిసిన కొల్లేరు రైతులు.
‎.. పర్యావరణ పరిరక్షణ, రైతుల జీవనోపాధి రెండూ ముఖ్యమేనన్న ఎంపీ.
‎.. సుప్రీం కోర్టులో రైతులకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఎంపీ విశ్వాసం.
‎.. ఎంపీకి కొల్లేరు రైతుల ధన్యవాదాలు.
‎.. ఎంపీ కార్యాలయంలో ప్రజా దర్బార్.

‎ఏలూరు, సెప్టెంబర్ 06: కొల్లేరు గ్రామాలకు చెందిన పలువురు రైతులు ఆదివారం ఉదయం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఆయన కార్యాలయంలో కలిశారు. కొల్లేరు భూముల సమస్యపై రైతుల తరపున పోరాడుతున్న ఎంపీకి రైతులు ధన్యవాదాలు తెలియచేశారు. 20,000 ఎకరాలకు పైగానే ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ వారికి హామీ ఇచ్చారు. వీటిలో ఎక్కువగా భాగం బీసీ, ఎస్సీ కులాల కు చెందిన వారే ఉన్నారన్న ఎంపీ, ఈ రైతులకు అన్యాయం జరగకుండా చూసేందుకే సుప్రీంకోర్టు సాధికార కమిటీ (CEC) తో కూడా తాను అనేకసార్లు మాట్లాడిన విషయాన్ని ఎంపీ రైతులకు గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణకు భంగం కలగకుండా, అదే సమయంలో లక్షలాది రైతుల, స్థానిక ప్రజల న్యాయసమ్మత హక్కులు, జీవనోపాధి కాపాడేలా కాంటూరు కుదింపు అంశం పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. సుప్రీం కోర్టులో కూడా రైతులకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఎంపీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొల్లేటికోటకు చెందిన భలే యేసురాజు నేతృత్వంలో రైతులు ఎంపీని ఘనంగా సన్మానించారు.
‎     అనంతరం కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలు, కార్యకర్తల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన ఎంపీ, ప్రతి వినతిని సావధానంగా విని సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

‎ఇట్లు
‎ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారి కార్యాలయం,
ఏలూరు.