భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..హైదరాబాద్ నగరంలో అత్యంత కీలకమైన చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఫ్లైఓవర్ డిజైన్లకు సంబంధించిన ఫోటో ప్రదర్శనను పరిశీలించిన అనంతరం ప్రజాప్రతినిధులతో కలిసి ఓపెన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ ఫ్లైఓవర్‌ను పరిశీలించారు.

రూ. 620 కోట్ల వ్యయంతో 3.2 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ గారు, వేం నరేందర్ రెడ్డి గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు, కె. రఘువీర్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.