భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..వినాయకుని రూపంలో సైబర్ సెక్యూరిటీ పాఠాలు!

ఈ ఏడాది సెప్టెంబర్ 14న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని..

తెలంగాణ పోలీసులు సైబర్ భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ‘సైబర్ విజ్ఞానం కలిగి ఉండండి’ అనే నినాదంతో గణేశుని రూపాన్ని పోలిన పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ పోస్టర్ ద్వారా వినాయకుడి పెద్ద చెవులు శ్రద్ధగా వినాలని, చిన్న కళ్లు నిశితంగా గమనించాలని, చేతిలోని కలం సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని సూచించారు.

సైబర్ మోసాలకు గురైనవారు వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా👇 www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.