భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..||విజయనగరం జిల్లా పోలీసు||
||మహిళలు, చిన్నారుల భద్రత మరియు గంజాయి నిర్మూలనకు అధిక ప్రాధాన్యత కల్పించాలి||
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్
విజయనగరం జిల్లా గజపతినగరం, పోలీసు స్టేషను మరియు గజపతినగరం సర్కిల్ కార్యాలయంను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ సెప్టెంబర్ 1న సందర్శించి, పోలీసు స్టేషన్ల పరిసరాలను పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో మహిళల భద్రత, గంజాయి నిర్మూలనకే అధిక ప్రాధాన్యత కల్పించే విధంగా రక్షణ, నియంత్రణ చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులు, సిబ్బంది జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మాట్లాడుతూ – గంజాయి నియంత్రణ, మహిళల భద్రతకు తొలి ప్రాధాన్యత కల్పించాలని, క్షేత్ర స్థాయిలో మహిళల సంరక్షణ, గంజాయి నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. మహిళల భద్రతకు, గంజాయి నియంత్రణకు పోలీసుశాఖ చేపడుతున్నచర్యలను ప్రజలకు మరింత చేరువ చేయాలని అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాల నిర్వహణ, సమాచార సేకరణలో దత్తత గ్రామాల పోలీసు సిబ్బంది మరింత క్రియాశీలకంగా పని చేయాలన్నారు. నేరాలనియంత్రణకు ఎప్పటికప్పుడు లాడ్జిలు, వాహన తనిఖీలను చేపట్టాలన్నారు. తరుచూ స్కూల్స్, కళాశాలలు సందర్శించి మహిళల భద్రత, రక్షణ పట్ల అవగాహన కల్పించాలన్నారు. రహదారి ప్రమాదాలు జరగకుండా వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్టాపర్లును ఏర్పాటు చేయాలని, రాత్రి సమయాల్లో స్టాపర్లు కనిపించే విధంగా వాటిపై రేడియం స్టిక్కర్లును అతికించాలన్నారు. దర్యాప్తులో ఉన్న కేసుల్లో దర్యాప్తు, సాక్షుల విచారణ, నిందితుల అరెస్టు వంటి వివరాలను ఎప్పటికప్పుడు సి.సి.టి.ఎన్.ఎస్.లో అప్ లోడ్ చేయాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపైన, డ్రంకన్ డ్రైవ్ చేసిన వారిపైన, ఎం.వి.నిబంధనలు ఉల్లంఘించిన వారిపైనా ఎన్ఫోర్సుమెంటు కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశించారు.
పోలీసు సిబ్బంది లేదా సర్కిల్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు వేచి ఉండేందుకు గజపతినగరం సర్కిల్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన వెయిటింగ్ రూమును జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారు ప్రారంభించారు. అనంతరం పోలీసు సిబ్బందితో జిల్లా ఎస్పీ మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ తనిఖీల్లో బొబ్బిలి డిఎస్పీ ఆర్.గోవిందరావు, గజపతినగరం సిఐ ఎస్.సన్యాసి నాయుడు, ఎస్బీ సిఐ ఎ.వి.లీలరావు, గజపతినగరం ఎస్ఐ కిరణ్ కుమార్, ఆండ్ర ఎస్ఐ సీతారం మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
||జిల్లా పోలీసు కార్యాలయం,||
||విజయనగరం.||
