భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన పోలీసులు

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డిని హత్య చేసింది ఆమె చదువు చెప్పిన విద్యార్థులేనని నిర్ధారించిన పోలీసులు

రూపా రెడ్డి హత్య కేసులో ఐదు బృందాలు ఏర్పాటు చేసి దాదాపు 70 సీసీ కెమెరాలు పరిశీలించాము

రూపా రెడ్డి చివరిసారిగా ఆమె పిన్నితో మాట్లాడుతూ “బాబు” అని అన్నట్టు తెలుసుకుని, స్కూల్ పిల్లలను కూడా అలానే పిలుస్తుందని నిర్ధారించి అక్కడ విచారణ మొదలుపెట్టాము

రూపా రెడ్డి హత్య తర్వాత నాలుగు రోజులు స్కూల్‌కు సెలవులు ఇవ్వగా, రీ ఓపెన్ అనంతరం స్కూల్‌కు గైర్హాజరైన 13 మంది విద్యార్థులను విచారించాము

వారిలో ఐదుగురు పదో తరగతి విద్యార్థులు ఉండగా, అందులో ఇద్దరు డబ్బులు ఖర్చు చేస్తూ జల్సాలు చేస్తున్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించాము

నిందితుల్లో ఒకరి దగ్గర రూ.1.54 లక్షల నగదు గుర్తించి, అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించగా, తల్లిదండ్రులు ఇచ్చారని నిందితుడు తెలిపాడు

నిందితుడి వద్ద దొరికిన నోట్లపై రక్తపు మరకలు చూసి ల్యాబ్‌కు పంపించగా,అది రూపా రెడ్డి రక్తమని నిర్ధారణ అయింది…