భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్ల పరిహారం
- నిర్వాసిత కుటుంబాలకు చెక్కు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- ఇప్పటి వరకూ రూ.518 కోట్లు పరిహారం చెల్లింపు
- సీఎం చంద్రబాబుకు కృతఙ్ఞతలు తెలిపిన అవనిగడ్డ టీడీపీ ఇంచార్జి విక్కుర్తి అవనిగడ్డ:

Ammiraju Udaya Shankar.sharma News Editor..వెలుగొండ ముంపు నిర్వాసిత బాధితులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.200 కోట్ల పరిహారాన్ని అందించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శాసన సభ ఆవరణలో బుధవారం జరిగిన కార్యక్రమంలో నిర్వాసిత కుటుంబాలకు రూ.200 కోట్ల చెక్కును సీఎం అందజేశారు.
జూన్ 27న నిర్వాసితులకు రూ.300 కోట్లును ప్రభుత్వం అందించింది. చివరి పరిహారంగా రూ .200 కోట్లను కలిపి మొత్తం రూ.518 కోట్లను పరిహారంగా అందించినట్టయింది. మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు అవనిగడ్డ టిడిపి ఇంచార్జి విక్కుర్తి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విక్కుర్తి మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రైతులు, నిర్వాసితులు చేసిన త్యాగాలను ప్రభుత్వం గుర్తించిదన్నారు. వెలిగొండ నిర్వాసితులను ఆదుకున్నది తమ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. మంచి చేసే ప్రభుత్వాలను గుర్తించాలని ఆయన కోరారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సర్వం కోల్పోతున్న బాధితులకు అన్ని విధాలా అండగా నిలిచేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు. సొంతంగా ఇళ్లు నిర్మించుకున్నందుకు గానూ ఓటీఎస్ కింద 2,557 కుటుంబాలకు ప్రభుత్వం రూ.318 కోట్ల మేర పరిహారం ఇప్పటికే చెల్లించింది. మరో 1,600 కుటుంబాలకు ఓటీఎస్ కింద రూ.200 కోట్లు పరిహారానికి సంబంధించి చెక్కును బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాసితులకు అందించారని విక్కుర్తి తెలిపారు. దీంతో నిర్వాసితులకు ఇప్పటి వరకు పరిహారం కింద 4,157 కుటుంబాలకు రూ.518 కోట్లను ప్రభుత్వం చెల్లించినట్టైందన్నారు. నిర్వాసితుల కోసం 7 పునరావాస కాలనీల్లో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టును ఈ నెలాఖరుకు ప్రభుత్వం ప్రజలకు అంకితం చేయనుందని విక్కుర్తి పేర్కొన్నారు. ఈ బృహత్తర ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు పెద్ద ఎత్తున పరిహారం అందించిన సీఎం చంద్రబాబుకు విక్కుర్తి శ్రీనివాసరావు కృతఙ్ఞతలు తెలిపారు.
