భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ లో ప్రైవేట్ స్కూల్ లో టీచర్ నిర్లక్ష్యంతో 6 ఏళ్ల బాలుడి మృతి..
టీచర్ మందలించడంతో భయంతో ఒక్కసారిగా ఆగిన బాలుడి గుండె..
విశాఖపట్నం వన్ టౌన్ పరిధిలో కొత్త కోట లో లిటిల్ గార్డెన్స్ స్కూల్ లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కలచివేసింది. ప్రణయ్ తేజ అనే బాలుణ్ణి స్కూల్ టీచర్ తీవ్రంగా కొట్టినట్లు తల్లిదండుల ఆరోపణలు, దెబ్బలను తట్టుకోలేక బాలుడు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళనకు దారితీసింది..
