భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..పేటలో 5 రోజుల పాటు ట్యాంకర్ల ద్వారానే తాగునీటి సరఫరా

మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు

చిలకలూరిపేట పురపాలక సంఘ పరిధిలోని 9 MLD వాటర్ ప్లాంట్ నుంచి కబేళా రోడ్డులోని వాటర్ ట్యాంక్‌కు వెళ్లే ప్రధాన పంపింగ్ పైప్‌లైన్‌ను పూర్తిగా మార్చనున్నట్లు మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు తెలిపారు. సంజీవనగర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు వద్ద ఈ పైప్‌లైన్‌కు తరచూ లీకేజీలు ఏర్పడి తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతుండటంతో కొత్త పైప్‌లైన్ ఏర్పాటు పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఈ పైప్‌లైన్ మార్పిడి పనులు పూర్తి కావడానికి సుమారు 5 రోజుల సమయం పడుతుందని కమిషనర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కబేళా రోడ్డు వాటర్ ట్యాంక్ ద్వారా నీటి సరఫరా జరిగే మోమిన్ బజార్, ఇస్లాంపేట, గుర్రాలచావడి, తూర్పుమాలపల్లి, కబేళా బజార్ మరియు పాక్షికంగా రూత్ డైక్మెన్ కాలనీ ప్రాంతాల ప్రజలకు పనులు పూర్తయ్యేంత వరకు మున్సిపల్ వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తామని స్పష్టం చేశారు. పనులు పూర్తయిన వెంటనే నీటి సరఫరా యథావిధిగా పునరుద్ధరించబడుతుందని, అప్పటివరకు పట్టణ ప్రజలు నీటిని పొదుపుగా వాడుకుని సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.