భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.గుంటూరు… పేకాట (జూదం)స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి
పేకాటరాయళ్ల గుట్టు రట్టు,భారీగా నగదు స్వాధీనం,29మంది జూదం రాయుళ్ళు,వాహనాలు, ఫోన్ స్వాధీనం
వైఫై గెస్ట్ హౌస్‌లో పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి – 29 మంది అదుపులో Rs, 23లక్షల ,77వేల ,120రూపాయలు – స్వాధీనం
నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్-1లో ఉన్న వైఫై గెస్ట్ హౌస్, 3వ అంతస్తు, రూమ్ నెం.304లో పేకాట నిర్వహిస్తున్నారన్న నిఘాడ సమాచారంతో గుంటూరు జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి.
ఈ దాడిలో పేకాట నిర్వహిస్తున్న 29 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 27 సెల్‌ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం, రూ.23లక్షల ,77వేల,120 రూపాయలు నగదు స్వాధీనం..
పేకాట నిర్వహిస్తున్న ఈశ్వరరావు (గుడివాడ), ఫణి (గుంటూరు)తో పాటు మొత్తం 29 మందిని విచారణ నిమిత్తం నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలింపు..

పేకాట, జూదం, మాదక ద్రవ్యాల అమ్మకం,వాడకం, వంటి అసాంఘిక కార్య కలాపాలపై ఎస్పీ వకుల్ జిందాల్ ఉక్కుపాదం పెట్టాలని కఠిన ఆదేశాలు
