పాకాల ఎస్.ఐ-3 గా బి.గోపాల్ నాయక్ బాధ్యతలు….
భారత్ డిజిటల్ న్యూస్ (పాకాల)20/07/2026 తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్లో పాకాల ఎస్.ఐ-3 గా బి.గోపాల్ నాయక్ సోమవారం బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా పాకాల ఎస్.ఐ-3 గా బి.గోపాల్ నాయక్ మాట్లాడుతూ తిరపతి ఎస్పీ కార్యాలయం వి.ఆర్ నుండి బదిలీ పై పాకాల పోలీస్ స్టేషన్ కు వచ్చి పాకాల ఎస్.ఐ-3 గా బాధ్యతలు చేపట్టడం జరిగిందని తెలిపారు.పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు నా వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.చట్టం దృష్టిలో అందరూ సమానులేనని,ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా విద్యార్థులు మత్తుపదార్థాలకి గంజాయి డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని బాగా చదువుకోవాలని మహిళలకు ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ సంప్రదించాలని వెంటనే పోలీస్ వారి టోల్ ఫ్రీ నెంబర్ ని ఉపయోగించాలని తెలిపారు

